మహిళల టి20 ప్రపంచకప్ లో.. టీమిండియా షెడ్యూల్

telugu.news18.com

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ప్రపంచకప్ సిద్ధమైంది.

మహిళల విభాగంలో సౌతాఫ్రికా వేదికగా ఈ నెల 10న టి20 ప్రపంచకప్ కు తెర లేవనుంది.

మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.


భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.

ఈ 10 జట్లను ఐదు టీమ్స్ చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.

ఒకసారి టీమిండియా షెడ్యూల్ ను చూద్దాం

ఫిబ్రవరి 12న భారత్ తన తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడనుంది.

అనంతరం ఫిబ్రవరి 15న వెస్టిండీస్ తో ఆడనుంది.

ఫిబ్రవరి 18న ఇంగ్లండ్, 20న ఐర్లాండ్ తో ఆడనుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి