వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్ ఇప్పటి నుంచి సన్నాహకాలను ఆరంభించింది.
ప్రస్తుతం సొంత గడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడుతుంది.
అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్ లను ఆడనుంది.
గురువారం రెండో వన్డే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈడెన్ గార్డెన్ లో చాలా తీపి గుర్తులు ఉన్నాయి.
కోహ్లీ మొహాలీ మొనగాడు అయితే.. రోహిత్ ఈడెన్ కా బాద్షా అని చెప్పవచ్చు.
ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ 11 మ్యాచ్ ల్లో 57.58 సగటుతో పరుగులు చేశాడు.
2014లో రోహిత్ శర్మ 264 పరుగుల డబుల్ సెంచరీని ఈడెన్ గార్డెన్స్ లోనే నమోదు చేశాడు.
అది కూడా శ్రీలంకపై కావడం విశేషం. ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా రోహిత్ చేసిన 264 పరుగులే ఉన్నాయి.
మరోసారి శ్రీలంకపై ఆడుతుండటంతో రోహిత్ చెలరేగే అవకాశం ఉంది