టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆఫ్ ఈజ్ లైఫ్ లో ఉన్నాడు.
టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
పిచ్ తో సంబంధం లేకుండా ఈ మిస్టర్ 360 ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
ఈ క్రమంలో ‘స్కై’ శిఖర్ ధావన్ రికార్డును అధిగమించేశాడు.
2018లో శిఖర్ ధావన్ అంతర్జాతీయ టి20ల్లో 689 పరుగులు చేశాడు. ఒక ఏడాది టి20ల్లో భారత ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే.
తాజాగా ఈ రికార్డును సూర్యకుమార్ యాదవ్ అధిగమించేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టి20ల్లో 732 పరుగులు చేశాడు.
ఓవరాల్ గా ఒక ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సూర్య 4వ స్థానంలో ఉన్నాడు.
పాక్ బ్యాటర్లు రిజ్వాన్ (1326, 2021లో), బాబర్ ఆజమ్ (939, 2021లో), పాల్ స్టిర్లింగ్ (748, 2019లో)లు మాత్రమే సూర్య కంటే ముందున్నారు.
టి20 ప్రపంచకప్ కూడా ఉండటంతో భారత్ కనీసం ఇంకో 7 టి20 మ్యాచ్ లను తప్పకుండా ఆడనుంది. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే రిజ్వాన్ రికార్డును కూడా సూర్య బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు.
ఒక ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా సూర్యకుమార్ నిలిచాడు.
ఈ ఏడాది ఇప్పటి వరకు సూర్య 44 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రిజ్వాన్ (42, 2021) పేరిట ఉండేది.