టి20 ప్రపంచకప్ ముందు భారత్ తన ఆఖరి టి20 సిరీస్ కు సిద్దమైంది.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.
దక్షిణాఫ్రికాపై టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం
రోహిత్ శర్మ.. సఫారీ జట్టుపై రోహిత్ శర్మ 13 మ్యాచ్ ల్లో 362 పరుగులు చేశాడు. సగటు 32.90.
ఈ ఫార్మాట్ లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా హిట్ మ్యాన్ ఉన్నాడు.
రెండో స్థానంలో మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఉన్నాడు. 12 మ్యాచ్ ల్లో 339 పరుగులు చేశాడు. సగటు 33.90.
మూడో స్థానం విరాట్ కోహ్లీదే. 10 మ్యాచ్ ల్లో 254 పరుగులు చేశాడు. సగటు 36.28గా ఉండటం విశేషం.
ఈ జాబితాలో శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 7 మ్యాచ్ ల్లో 233 పరుగులు చేశాడు. సగటు 33.28.
ఇషాన్ కిషన్ 5 మ్యాచ్ ల్లోనే 206 పరుగులు చేశాడు. సగటు 41.20గా ఉండటం విశేషం.