ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో అదరగొట్టేశాడు.
ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ ఘనతకెక్కాడు.
31 మ్యాచ్ ల్లో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం విశేషం.
తాజాగా ఐసీసీ ప్రకటించిన పురుషుల టి20 ర్యాంకింగ్స్ లో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
890 రేటింగ్ పాయింట్లతో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో ఈ ఏడాదిని నంబర్ వన్ హోదాతో ముగించనున్నాడు.
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ 836 రేటింగ్స్ తో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్ లో రికార్డుల సునామీని సృష్టించినా కింగ్ కోహ్లీ పేరిట ఉన్న ఒక రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు.
2016లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టి20ల్లో టాప్ ర్యాంక్ లో నిలిచాడు. ఆ సమయంలో కోహ్లీ 897 రేటింగ్ పాయింట్లను సాధించాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టి20ల్లో టాప్ ర్యాంక్ ను సాధించినా.. రేటింగ్స్ లో మాత్రం కోహ్లీని టచ్ చేయలేకపోయాడు.