టీమిండియాను గత కొంత కాలంగా బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
పేలవ బౌలింగ్ కారణంగానే భారత్ గతేడాది జరిగిన ఆసియా కప్, టి20 ప్రపంచకప్ లలో నిరాశ పరిచింది.
అయితే ప్రస్తుతం భారత బౌలింగ్ కాస్త మెరుగైంది.
అందుకు ముఖ్య కారణం మొహమ్మద్ సిరాజ్.
టి20 ప్రపంచకప్ తర్వాత సిరాజ్ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు.
ఈ ఏడాది 5 వన్డేల్లో 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు.
ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ భారత్ కు శుభారంభాలు చేస్తున్నాడు.
సిరాజ్ ఆడిన మ్యాచ్ ల్లో తొలి 10 ఓవర్లలో వికెట్లను తీయడంలో భారత్ ముందుంది.
20 మ్యాచ్ ల్లో 40 వికెట్లను తీసింది. ప్రతి 20.4 బంతులకు ఒక వికెట్ ను తీసింది.
అదే సిరాజ్ లేని మ్యాచ్ ల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
29 వన్డేల్లో కేవలం 21 వికెట్లను మాత్రమే తీసింది. అంటే ప్రతి 83.7 బంతులకు ఒక వికెట్ ను తీసింది.
ఇక బుమ్రా కూడా జట్టులోకి వస్తు సిరాజ్, బుమ్రా, షమీలతో బౌలింగ్ లైనప్ భీకరంగా మారే అవకాశం ఉంది.