టీమిండియా న్యూజిలాండ్ పర్యటన క్లైమ్యాక్స్ కు చేరుకుంది.
టి20 సిరీస్ ను నెగ్గిన భారత్.. వన్డే సిరీస్ ను నెగ్గే అవకాశాన్ని కోల్పోయింది.
తొలి వన్డేలో కివీస్ చేతిలో భారత్ ఓడటం.. రెండో వన్డే వర్షంతో రద్దు కావడంతో మూడో వన్డేలో భారత్ నెగ్గినా సిరీస్ మాత్రం సొంతం కాదు.
సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది.
ఇక ఈ మ్యాచ్ లో భారత్ రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడే అవకాశం ఉంది.
దాంతో మరోసారి సంజూ సామ్సన్ కు నిరాశ తప్పేలా లేదు.
దీపక్ హుడా అదనపు బౌలర్ గా మరోసారి జట్టులో చోటు పక్కా.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ (అంచనా) : శిఖర్ ధావన్ (కెప్టెన్), గిల్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్