మిక్సీ, వాషింగ్ మెషీన్.. క్రికెట్ లో
వింత అవార్డ్స్..!

telugu.news18.com

క్రికెట్‌ (Cricket)లో ప్లేయర్స్ కు అవార్డులు ఎన్నో ఉన్నాయి. 

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్.. వంటి పేర్లు మనం వింటుంటాం. 

అయితే ఇవే కాకుండా క్రికెట్ చరిత్రలో ఒక ఐదు యూనిక్ అవార్డులను కొన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్స్‌కు అందించాయి.


ప్రొఫెషనల్ క్రికెట్‌లో మోస్ట్ యూనిక్ అవార్డ్స్‌గా పేరొందిన ఈ జాబితా చూడండి.

* బ్లెండర్ : క్రికెట్‌లో బ్లెండర్ (Blender) లేదా మిక్సీని స్పెషల్ అవార్డుగా అందించడం ఒక వింతగా చెప్పుకోవచ్చు. 

ఢాకాలో జరిగిన లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ల్యూక్ రైట్‌.. అద్భుత ప్రదర్శన చేసినందుకు బ్లెండర్‌ను స్పెషల్ అవార్డుగా అందుకున్నాడు. 

* వాషింగ్ మెషిన్ : గతంలో ఓసారి వాషింగ్ మెషిన్‌ను కూడా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రివార్డుగా అందించారు. 

1978లో ఐర్లాండ్ కెప్టెన్ డెర్మోట్ మాంటెయిత్.... ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచులో ఈ స్పెషల్ రివార్డును అందుకున్నాడు 

* సన్‌షైన్ స్నాక్స్ వోచర్ :2017 కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాన్సర్ సన్‌షైన్, మ్యాచ్‌లో బెస్ట్ షాట్ కొట్టిన ఆటగాడికి స్నాక్స్ ప్యాకేజీతో అవార్డును అందించింది.

* లాన్‌మవర్ (Lawnmower) : ఇంటి పెరట్లో గడ్డి కత్తిరించే లాన్‌మవర్‌ను ఓ సందర్భంలో స్పెషల్ క్రికెట్‌ అవార్డుగా అందించారు. 

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మఖాయా ఎన్తినీ ఈ అవార్డు అందుకున్నాడు.

* ఇంటర్నేషనల్ లీగ్ T20లో గ్రీన్ బెల్ట్ : ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) గతంలో ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నమెంట్‌ను ప్రారంభించింది. 

 ఆ పోటీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు గ్రీన్ బెల్ట్‌ను (Green belt) అవార్డుగా ఇచ్చారు. ఇది రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ బెల్ట్‌లా వినూత్నంగా కనిపిస్తుంది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి