9 రకాల డక్ అవుట్స్ గురించి మీకు తెలుసా?

telugu.news18.com

ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇక క్రికెట్ రూల్స్ గురించి దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.

క్రికెట్ లో ఏ బ్యాటర్ అయినా ఖాతా తెరవకుండా అవుటైతే (0) దానిని డక్ అవుట్ గా పరిగణిస్తాం.


క్రికెట్ లో 9 రకాల డక్ అవుట్స్ ఉన్నాయని మీకు తెలుసా?

సున్నాకే అవుటైతే దానిని ‘డకౌట్’ అంటారు.

ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైతే దానిని ‘గోల్డెన్ డక్’ అంటారు.

ఎదుర్కొన్న రెండో బంతికి అవుటైతే దానిని ‘సిల్వర్ డక్’ అంటారు.

ఎదుర్కొన్న మూడో బంతికి అవుటైతే దానిని ‘బ్రాంజ్ డక్’ అంటారు.

ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా రనౌట్ రూపంలో అవుటైతే అది ‘డైమండ్ డక్’

ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ అవుటైతే దానిని ‘రాయల్ డక్’గా పేర్కొంటారు.

ఇక టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ డకౌట్ అయితే దానిని ‘పెయిర్ డక్’ అంటారు.

టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైతే దానిని ‘కింగ్ పెయిర్ డక్’గా పేర్కొంటారు.

10వ వికెట్ ప్లేయర్ డకౌట్ అయితే దానిని ‘లాఫింగ్ డక్‘ అంటారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి