కార్తీక్ కాకా.. రికార్డు కేక

telugu.news18.com

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మార్చి 31న ఘనంగా ఆరంభం కానుంది.

తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.

ఐపీఎల్ 16వ సీజన్ లో టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్ మరోసారి మాయ చేసేందుకు సిద్ధమయ్యాడు.


గతేడాది ఆర్సీబీ తరఫున ఫినిషర్ గా మెరుపులు మెరిపించాడు.

కార్తీక్ కాకాను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఈ ఐపీఎల్ లో మరో 59 పరుగులు చేస్తే టి20 ఫార్మాట్ లో 7,000 పరుగులను అందుకున్న ప్లేయర్ గా నిలుస్తాడు.

భారత్ నుంచి ఇప్పటి వరకు కోహ్లీ, ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రమే ఈ ఘనతను సాధించారు.

తాజాగా ఈ రికార్డుకు కేవలం 59 పరుగుల దూరంలో నిలిచాడు కార్తీక్ కాకా.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి