ఈ ఏడాది టీమిండియాకు చాలా కీలకం.
ఆస్ట్రేలియా సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలు ఆడాల్సి ఉంది.
ముఖ్యంగా స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తుంది.
అయితే.. ఈ ఏడాది పాటు ఓ మ్యాచ్ విన్నర్ జట్టుకు దూరం కానున్నాడు.
ఇది నిజంగా టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్ లాంటిది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.
పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఈ సమాచారం బీసీసీఐకి వైద్యులు తెలిపినట్టు తెలుస్తుంది.
పంత్ 8 నెలల తర్వాత కోలుకున్నా.. ఆ తర్వాత అతని ప్రాక్టీస్ చేయడానికి మరింత టైం పట్టే అవకాశం ఉంది.
అంటే.. దాదాపు పంత్ ఏడాది పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు.
గేమ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా ఉన్న పంత్ దూరమైతే టీమిండియాకు పెద్ద లోటే అని చెప్పాలి.