2061 జులై 28న హేలీ తోకచుక్క (Halley's Comet) భూమికి దగ్గరగా వెళ్తుంది.
2178 మార్చి 23న ప్లూటోని కనిపెట్టిన తర్వాత తొలిసారి అది సూర్యుని చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది.
2880 మార్చి 16న గ్రహశకలం 1950 DA భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
11,700 ఏళ్ల తర్వాత నార్త్ పోల్ స్టార్‌గా పిలిచే పోలారిస్ (Polaris) స్థానంలోకి గమ్మా సెఫీ (Gamma Cephei) వస్తుంది.
36,000 ఏళ్ల తర్వాత ఓ ఎరుపు మరుగుజ్జు నక్షత్రం (dwarf star) సూర్యుడికి దగ్గరగా వస్తుంది.
1,00,000 ఏళ్ల తర్వాత నక్షత్ర రాశులేవీ గుర్తించగలిగేలా ఉండవు. అవి ఏ రూపమూ ఏర్పరచవు.
5 కోట్ల ఏళ్ల తర్వాత మార్స్‌కి కూడా శనిగ్రహం లాంటి వలయాలు వస్తాయి.
24 కోట్ల తర్వాత పాలపుంత (Milkyway)లో మన సౌర కుటుంబం ఒక రౌండ్ పూర్తి చేస్తుంది.
300 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు వ్యాకోచించడం వల్ల.. భూమి అంతరిస్తుంది. జీవం పోతుంది.
500 కోట్ల ఏళ్ల తర్వాత పాలపుంత గెలాక్సీని ఆండ్రోమెడా (Andromeda) గెలాక్సీ ఢీకొంటుంది.