సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకున్నారు 

అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

సమంత మరో అరుదైన గౌరవం. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవా స్టేట్‌లో జరగునున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (IFFI) నుంచి ఆహ్వానం అందింది. 

ఈ వేడుకకు దక్షిణాది నుంచి వేరే హీరోయిన్స్ అటెండ్ అయినా.. వేదిక ఎక్కి ప్రసంగించే అవకాశం ఎవరికి రాలేదు. ఇపుడా ఛాన్స్ సమంతకు దక్కింది. 

మరోవైపు ఈ వేడుకలో హిందీ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌‌ కూడా ప్రసంగించనున్నారు. ఈ ఇద్దరు ‘ధి ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంత పాపులారిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు వేదికపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కింది. 

ఇక విడాలకుల తర్వాత తన స్నేహితురాలితో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసిన సమంత.. ఇపుడు తన కెరీర్ పై దృష్టి సారించింది. 

సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తున్నారు. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయనుంది.

కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

 ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని చేస్తున్నారు.