టాలీవుడ్లో పాటు దేశ విదేశాల్లో రాజమౌళి ట్రెండ్ నడుస్తోంది
రాజమౌళి రూపొందించిన RRR సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకుంటోంది
ఈ నేపథ్యంలో రాజమౌళిపై తనదైన స్టైల్లో కామెంట్ చేశారు ఆర్జీవీ
రాజమౌళిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పి షాకిచ్చారు
రాజమౌళితో జేమ్స్ కామెరూన్ మీట్ అయిన వీడియో పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ వదిలారు ఆర్జీవీ
రాజమౌళి గారు మీరు మీ సెక్యూరిటీని పెంచుకోండి అని ఆర్జీవీ అన్నారు
ఇండియాలోని కొందరు ఫిల్మ్ మేకర్స్ అసూయతో గ్రూపుగా ఏర్పడి జక్కన్నపై దాడి చేయబోతున్నట్లు ఆర్జీవీ చెప్పారు
అంతా కలిసి మిమ్మల్ని చంపేయవచ్చు. అందులో నేను కూడా ఉన్నాను అని ఆర్జీవీ అన్నారు
దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి
రాజమౌళి రేంజ్ తెలిసేలా ఆర్జీవీ ఇలా పరోక్షంగా కామెంట్స్ పెట్టారని కొందరు అంటున్నారు