రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు. ఆయన ఏది మాట్లాడినా అందులో ఎంతోకొంత లాజిక్ ఉంటుంది
తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండటం ఆర్జీవీ నైజం
సినిమాలు తీయడంలో వైవిధ్యం చూపిస్తున్న ఆర్జీవీ అప్పుడప్పుడూ పొలిటికల్ టచ్ ఇస్తున్నారు
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ రాజకీయ నాయకులపై కామెంట్స్ చేస్తున్నారు ఆర్జీవీ
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటం ఆర్జీవీకి అలవాటే
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన చేసిన కామెంట్ వైరల్ అవుతోంది
నిజమైన పాన్ ఇండియా స్టార్ సీఎం కేసీఆర్ అన్నారు రామ్ గోపాల్ వర్మ
బాహుబలి, RRR, పుష్ప, KGF 2 సినిమాల అడుగుజాడల్లో TRS పార్టీ వెళుతోందని అన్నారు ఆర్జీవీ
TRS కూడా BRS గా పాన్ ఇండియాగా ఆవిర్భవించనుందని ఆర్జీవీ జోస్యం చెప్పారు
తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లాగా కాకుండా రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్ అని ఆర్జీవీ అన్నారు