చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది
ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు
ఈ వీరయ్య విజయ విహారంలో రామ్ చరణ్ స్పీచ్ హైలైట్ అయింది
సభా వేదికగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి
ఎవరేమన్నా చిరంజీవి సైలెంట్‌గా ఉంటారేమో గానీ.. ఆయన వెనక ఉన్న తాము సైలెంట్‌గా ఉండమని రామ్ చరణ్ అన్నారు
ఆయన ఒక్కసారి పట్టు బిగించి పిడికిలి బిగిస్తే ఏమవుతుందో ఊహించుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు
దీంతో ఇటీవల చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వారికి చెర్రీ ఈ వార్నింగ్ ఇచ్చారని స్పష్టమవుతోంది
మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి, సినీ నటి రోజాకే ఈ కౌంటర్ అని చెప్పుకుంటున్నారు
వరంగల్ లో జరిగిన ఈ వేడుకలో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య కలెక్షన్ల సునామీ కంటిన్యూ అవుతోంది