ఆస్కార్ వేదిక నుంచి నేరుగా ఢిల్లిలో లాండ్ అయిన రామ్ చరణ్..

ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. 

ఈ సందర్భంగా ఈ సినిమాలో నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్‌ అమెరికా నుంచి దేశ రాజధాని ఢిల్లిలో లాండ్ అయ్యాడు. 

ఈ సందర్భంగా ఢిల్లీలో అభిమానులు రామ్ చరణ్‌తో ఫోటోలు, సెల్పీలు దిగేందకు ఎగబడ్డారు. 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాతోొ ఎన్టీఆర్, రామ్ చరణ్ లోకల్ నుంచి గ్లోబల్ హీరోలుగా ఎదిగారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో లయ బద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్‌కు ఫిదా కానీ అభిమానులు లేరు. 

రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో జరిగే ఇండియా టుడే కాంక్లేవ్ కోసం హస్తినలో లాండ్ అయ్యాడు

సతీ సమేతంగా. అక్కడ రాత్రి 9.30 గంటలకు రామ్ చరణ్ మీడియాతో ఇంట్రాక్ట్ కానున్నారు.

ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఇప్పటికే కేంద్ర హోం మంత్రి దేశంలో నెంబర్ టూ అయిన అమిత్ షా హాజరు కానున్నారు. 

అటు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి