లేడీ సూపర్ స్టార్ గా సౌత్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార

నయనతార అసలు పేరు ఏంటీ..

దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నయనతార ఇప్పటి వరకూ 75 చిత్రాల్లో నటించారు.

ఈ రోజు నయన్ తన 37వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి విషయాలు..

నయనతార కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్‌. 

ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక ఆమె తన పేరును నయనతారగా అని మార్చుకున్నారు.

నయనతార వాస్తవానికి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు, సిరియన్ క్రిస్టియన్‌గా పెరిగారు. 

ఆమె 2011 లో ఆమె చెన్నై లోని ఆర్య సమాజ్ ఆలయంలో హిందూ మతాన్ని స్వీకరించారు.

ప్రస్తుతం నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ప్రేమలో ఉన్నారు. ఈ వీరి పెళ్లి వచ్చే ఏడాది జరుగనుందని టాక్.

నయనతార ప్రస్తుతం విఘ్నేష్‌ దర్శకత్వంలో వస్తున్న కాతు వాక్కుల రెండు కాదల్‌ అనే సినిమాలో చేస్తున్నారు. 

సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. 

రజనీకాంత్ హీరోగా వచ్చిన అన్నాత్తేలో నయనతార హీరోయిన్‌గా నటించారు. నయనతారకు ‘గాడ్ ఫాదర్’ టీమ్ బర్త్ డే విషెస్ తెలియజేసింది.