లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

 ప్రియుడితో నయనతార బర్త్ డే సంబరాలు..

దీంతో ఇటు సెలెబ్రిటీస్‌తో పాటు అటు అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. 

ఇక మరోవైపు నయనతార బర్త్ డేను ఆమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ ఘనంగా నిర్వహించారు. 

దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. 

ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. 

తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపును పొందారు

సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్‌కు లేని విధంగా నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి ఆమె పాపులారిటీ కూడా ఒక కారణం కావోచ్చు.

నయనతార ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తమకు గతంలో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని తెలిపిన సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నయన్ తమ ప్రేమాయణానికి ముగింపు పలకనుందని తెలుస్తోంది. 

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ప్రముఖ చర్చిలో ఈ జంట వివాహం జరగబోతుందని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..