నాగార్జున ’ది ఘోస్ట్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ స్పె థ్రిల్లర్ ఘోస్ట్. 

ఈ సినిమా మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలై  బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. 

నాగార్జున ఇమేజ్‌కు తగ్గ కలెక్షన్స్‌ను కూడా రాబట్టలేకపోయింది.  మంచి బజ్‌తో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ నటించారు. 

ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. టోటల్‌ రన్‌లో  ఈసినిమా రూ. 6.15 కోట్ల షేర్ (రూ. 11.40 కోట్ల గ్రాస్ ) ప్రపంచ వ్యాప్తంగా వసూళు చేసింది. 

ఈ సినిమా రూ. 21.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.85  కోట్ల  నష్టాలను మిగిల్చింది. 

ఓవరాల్‌గా రూ. 16 కోట్ల నష్టాలను మూట గట్టుకుంది. 

ఒక రకంగా ది ఘోస్ట్ కలెక్షన్స్ నాగార్జున మార్కెట్‌ను ప్రశ్నార్ధకం చేసాయనే చెప్పాలి. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి