నాగార్జునకు సాధ్యమైన అరుదైన ప్రపంచ రికార్డు 

టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరో నాగార్జునకు ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. 

ఈయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి.

ఇన్నేళ్లు కెరీర్‌లో నాగార్జునకు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డు.

 ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.

హీరోగా 36 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యేడాది బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో పలకరించిన ఈయన త్వరలో ఈయన ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. 

తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. 

అక్కినేని నాగేశ్వర రావు సరసన నటించిన శ్రీదేవి, రాధ,రమ్యకృష్ణ లతో ఆయన తనయుడైన నాగార్జునకు జోడిగా నటించారు. 

 నాగార్జున విషయానికొస్తే..తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు కొడుకు నాగ చైతన్యకు జోడిగా నటించిన లావణ్య త్రిపాఠితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేసారు.

అంతేకాదు చైతూ సరసన ‘రారండోయ్ వేడుక చేద్దాం’  సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ‘మన్మథుడు’ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మన్మథుడు 2’ లో  కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. 

ఈ రకంగా అటు తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో నటించారు. 

ఇటు తనయుడు నాగ చైతన్యకు జోడిగా నటించిన భామలతో సిల్వర్ స్క్రీన్‌పై జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి