కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. 

ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. 

కొంత మందికి ఎన్నో సినిమాల్లో నటిస్తే రాని పేరు... ఒకే ఒక్క సినిమా ‘మహానటి’ నటితో దక్షిణాదిలో ఆమెకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న నటి కీర్తి సురేష్. 

ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే..మరోవైపు నటనకు అవకాశం పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.

Heading 3

అభినవ సావిత్రి కీర్తిసురేష్ పేరు తెచ్చుకున్న కీర్తి 1992లో అక్టోబర్ 17న సురేష్, మేనక దంపతులకు జన్మించారు. 

తండ్రి మలయాళంలో పెద్ద దర్శక, నిర్మాత. తల్లి మేనక మలయాళంలో పెద్ద హీరోయిన్. 

మేనక అప్పట్లో చిరంజీవి 'పున్నమినాగు'లో నాయికగా నటించారు. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు

బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత 2013లో  ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గీతాంజలి’ మొదటి మూవీ. 

ఈ మూవీలో కీర్తి సురేష్ మొదటిసారి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

తమిళంలో నటిస్తూనే తెలుగులో కీర్తి సురేష్..రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ మూవీతో తెరంగేట్రం చేశారు. 

ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మరో సక్సెస్‌ను ఆమె అకౌంట్‌లో వేసుకున్నారు.