4 క్రేజీ సీక్వెల్స్‌లో కమల్ హాసన్.. 

telugu.news18.com

విశ్వనటుడు కమల్ హాసన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. 


అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘విక్రమ్’. 

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బంపర్ హిట్. అంతేకాదు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ఇతర కీలకపాత్రల్లో నటించగా.. కీలకపాత్రలో కనిపించిన నటుడు సూర్య. 

థియేటర్ రన్ ముగియడంతో ఓటీటీలోకి ఎంట్రీ. హాట్ స్టార్‌లో జూలై 8 నుంచి స్ట్రీమింగ్..


ఇక అది అలా ఉంటే విక్రమ్ సంచలన విజయంతో హ్యాపీ మూడ్‌లో కమల్ హాసన్..

ఈ సంతోషంలో ఆయన వరుసగా 4 క్రేజీ సీక్వెల్స్‌లో నటించబోతున్నట్లు సమాచారం. 

త్వరలో భారతీయుడు 2 షూటింగ్‌లో పాల్గోనబోతున్న కమల్. వచ్చే ఏడాది విడుదల. 


దీంతో పాటు సూపర్ హిట్ సైకో-థ్రిల్లర్ రాఘవన్ పార్ట్ 2, విక్రమ్ 2 సినిమా చేయనున్న విశ్వనటుడు. 


ఈ మూడు కాకుండా, శభాష్ నాయుడు వస్తోంది. ఈ సినిమా దశావతారం సినిమాలో బలరామ్ పాత్రకు సీక్వెల్.. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి