గాడ్ ఫాదర్ మూవీకి జనసేన పార్టీకి ఉన్న సంబంధం ఇదే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ మూవీ. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచింది.
అంతేకాదు ఈ ట్రైలర్‌లోని సీన్స్‌ను జనసేన పార్టీతో పోలుస్తున్నారు అభిమానులు.
గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ కంటే ముందు నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది.
గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి జన జాగృతి పార్టీని కాపాడే గాడ్ ఫాదర్ పాత్రలో నటించారు.
గాడ్ ఫాదర్ మూవీలోని ‘జన జాగృతి పార్టీ’లో కూడా జనసేన పార్టీ లాగా పిడికిలి బిగించి ఉండటం.. తమ్ముడు పనవ్ కళ్యాణ్‌కు రాజకీయంగా ఉపయోగపడేలా ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు మాట్లాడుకుంటున్నారు.
జనసేనది JSP అయితే.. గాడ్ ఫాదర్ మూవీలో JJP గా చూపించారు.
చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోను మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిరు ఇప్పటి పార్టీలను ఈ సినిమాలో విమర్శించే సాహసం చేస్తారా అనేది చూడాలి.
మొత్తంగా చిరంజీవి చేసిన ’గాడ్ ఫాదర్’ మూవీ జనసేన పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది చూడాలి.
మొత్తం సినిమాలో చిరు నడిపే పార్టీ కూడా జనసేనను పోలి ఉండటం చూసి మెగాభిమానులు గాడ్ ఫాదర్ సినిమాలోని సీన్స్‌ను జనసేను లింక్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.