సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్ళికి సంబంధించిన ఇష్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది
మీనా భర్త విద్యా సాగర్ ఈ ఏడాది జూన్ 28న అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే
భర్త మరణం తర్వాత తీవ్ర బాధలో కూరుకుపోయిన మీనా.. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది
ప్రస్తుతం తన కూతురితో కలిసి ఒంటరిగా ఉంటోంది మీనా
మీనా సన్నిహితులు ఆమెను కలిసి చేదు జ్ఞాపకాల నుంచి బయటకు తెస్తున్నారు
మీనాను పరామర్శించేందుకు సంగీత, రంభ వంటి తోటి నటులు ఆమె ఇంటికి వెళ్లి ఓదార్చుతున్నారు
ఈ క్రమంలోనే మీనా రెండో పెళ్లి న్యూస్ బయటకొచ్చింది
మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే న్యూస్ వైరల్ అయింది
ఈ వార్తలపై మీనా సన్నిహితులు రియాక్ట్ అయ్యారు
అవన్నీ ఫేక్ అని, మీనా రెండో పెళ్లి చేసుకోవడం అనేది ఎవరో పుట్టించిన రూమర్ అని అన్నారు