చిరంజీవి మరో షాకింగ్ డెసిషన్.. 

 చిరంజీవి తన కెరీర్‌లో ఎంతో మంది దర్శకులతో అనుకున్న సినిమాలు ఒక్కోసారి కథ కుదరకనో పట్టాలెక్కలేదు. 

అలా రామ్ గోపాల్ వర్మ,, సింగీతం శ్రీనివాస రావు సహా ఎంతో మంది దర్శకులతో ఈయన చేయాలనుకున్న ప్రాజెక్ట్‌లు చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన సందర్భాలున్నాయి.

ఇలా ఎ.కోదండరామిరెడ్డితో రెండు చిత్రాలతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి, వి.ఎన్.ఆదిత్యతో అనుకున్న ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. 

ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తన 150వ చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌తో చేద్దామనుకున్నాడు

పూరీ జగన్నాథ్ చెప్పిన ‘ఆటో జానీ’ కథ సెకాండాఫ్ అనుకున్నంత రేంజ్‌లో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేసారు చిరంజీవి. 

ఆ తర్వాత తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్‌గా చేసి గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు

ఇక చిరంజీవి క్యాన్సిల్ చేసిన దర్శకుల లిస్టులో సాహో ఫేమ్ సుజిత్ కూడా ఉన్నారు. ముందుగా ‘గాడ్ ఫాదర్’ రీమేక్‌ను సుజిత్ చేతిలోనే పెట్టాలకున్నారు చిరు. 

ఇక సుజిత్ నేరేట్ చేసిన కథ చిరును మెప్పించలేకపోయింది. ఆ తర్వాత లైన్‌లోకి వినాయక్ సహా పలువురు పేర్లు వినిపించినా.. చివరకు మోహన్ రాజా చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టారు చిరంజీవి 

తాజాగా చిరంజీవి త్రివిక్రమ్‌తో పాటు వెంకీ కుడుముల, మారుతి తో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టినట్టు సమాచారం. 

ఇలా చిరంజీవి సెకండ్  ఇన్నింగ్స్‌లో యంగ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై నెటిజన్స్ చిరంజీవి పై మండిపడుతున్నారు. 

మొత్తంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా షాకింగ్ డెసిషన్స్ తీసుకోవడం సర్వత్రా విమర్శపాలువుతుంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి