Your Page!


హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది ఈ పంజాబీ అందం. 

ఛార్మీ తన 14 సంవత్సరాల వయస్సులోనే నీ తోడు కావాలి (2001) అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

 కృష్ణవంశీ శ్రీఅంజనేయం సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చారు ఛార్మి. ఈ సినిమా తనకు మంచి పాపులారిటీని తెచ్చింది.

ఆ తర్వాత వరుసగా చక్రం, పౌర్ణమి, రాఖీ, మాస్, చంటీ, మంత్ర వంటి పలు చిత్రాలలో నటించారు

ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గోన్న ఛార్మి మాట్లాడుతూ.. తన మొదటి రెమ్యూనరేషన్ మాత్రం రెండు వందలు అని పేర్కోన్నారు.

స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఓ సినిమా కోసం జూనియర్ ఆర్టిస్టుగా చేశారట. అందులో నటించినందుకు రెండు వందలు ఇచ్చారట. 

ఇక ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఆమె నిర్మాతగా లైగర్ అనే సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ లైగర్ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తోంది.

లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని అర్థం. తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో రూపోందుతోంది.

ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రమ్యకృష్ణ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తున్నారు.