సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ అనుష్క. 

అనుష్క శెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార.

అనుష్క డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు.

మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రాధాన్యమున్న సినిమాలు వచ్చాయి. 

కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. 

దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటిగా మారింది అనుష్క.

మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగళూరులోనే జరిగింది.

ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు.

అనుష్క ప్రభాస్ సరసన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘భాగమతి ‘ నిశ్శబ్దం’, వంటి సినిమాలను చేశారు. 

ఇక తాజాగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమాను ఒప్పుకున్నారు అనుష్క. నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నారు.