తండ్రీ కొడుకులైన ఏయన్నార్, నాగార్జున కలిసి నటించిన సినిమాలు ఇవే.. 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా నాగార్జున అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు నాగార్జున తండ్రి అక్కినేని బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు.

కలెక్టర్ గారి అబ్బాయి - సూపర్ హిట్ 

        అగ్ని పుత్రుడు - డిజాస్టర్ 

రావుగారిల్లు - నాగార్జున (గెస్ట్) హిట్ 

ఇద్దరూ ఇద్దరే   - అట్టర్ ఫ్లాప్ 

శ్రీరామదాసు  - బ్లాక్ బస్టర్ 

మనం - బ్లాక్ బస్టర్ ఈ సినిమాలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించడం విశేషం. 

అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం మనం. ఈ సినిమాను ఏఎన్నార్ చూడకుండానే కనుమూయడం విషాదకరం . 

అక్కినేని మూడు తరాల హీరోలు మనం సినిమాలో కలిసి నటించడం విశేషం. తెలుగులో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక ఫ్యామిలీ అక్కినేనిదే కావడం మరో గొప్ప విశేషం. 

రావుగారిల్లు, శ్రీరామదాసు, సినిమాల్లో తండ్రి కొడుకుల పాత్రలో నటించని ఏఎన్నార్, నాగార్జున. మనంలో మాత్రం నాగార్జున తనయుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించడం విశేషం. 

అక్కినేని హీరోలతో నాగేశ్వరరావు. వీళ్లలో అక్కినేని మనవళ్లైన నాగ చైతన్య, అఖిల్‌తో అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించారు. 

నాగార్జున బాల నటుడిగా తండ్రి అక్కినేనితో ‘వెలుగు నీడలు’, ‘సుడిగుండాలు’ సినిమాల్లో నటించాడు. ఈ రకంగా మొత్తంగా 8 చిత్రాల్లో వీళ్లిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి