ఎవరీ బింబిసారుడు.. ఇదీ చరిత్ర
బింబిసారుడు.. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆయనది హర్యాంక వంశం. క్రీస్తు పూర్వం 558 జన్మించారు. భట్టియా అనే అధిపతి కుమారుడు. 15 ఏళ్ల పిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు.
క్రీస్తు పూర్వం 543 నుంచి 492 వరకు మగధ సామ్రాజ్యాన్నిపాలించారు. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ (రాజగిరి). ఆ తర్వాత పాటలీపుత్ర (పాట్నా) రాజధానిగా చేసుకొని పాలించారు.
బిహార్, గంగానది దక్షిణ ప్రాంతాల్లో మగధ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. బౌద్ధ మత వ్యవస్థాపకులైన గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఎక్కువ కాలం మగధ సామ్రాజ్యంలోనే గడిపారు.
బింబిసారుడు కోసల రాజు మహా కోసల కూతురైన కోసలా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లిచ్చావి రాజకుమారి చెల్లన, మద్రా రాజకుమారి క్షేమను వివాహమాడారు.
బింబిసారుడికి ఈయనకు 500 భార్యలు ఉన్నారని మహావగ్గ వర్ణించారు. మగధ రాజ్య సింహాసనం అధిరోహించడానికి బింబిసారుడి కుమారుడు అజాతశత్రువే ఆయన్ను ఖైదు చేశారు.
తనకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే బింబిసారుడు మరణించారు. క్రీ.పూ. 491లో ఇది జరిగింది
బింబిసారుడు.. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆయనది హర్యాంక వంశం. క్రీస్తు పూర్వం 558 జన్మించారు. భట్టియా అనే అధిపతి కుమారుడు. 15 ఏళ్ల పిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు.
బింబిసారుడు .. బుద్ధుని సమకాలికుడైనప్పటికీ ఏ మతాన్ని ఆదరించాడనే దానిపై స్పష్టత లేదు. బౌద్ధ, జైన మతాలు రెండూ ఈయన్ను తమ మతస్థుడిగానే చెప్పుకుంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి