ఆహారం తినకుండా బతకడం అసలు సాధ్యమవుతుందా..? మహా అయితే కొన్ని రోజుల వరకు జీవించగలుగుతాం అని అనుకంటాం కదా.
అయితే పశ్చిమబెంగాల్‌లోని ఓ బామ్మ మాత్రం ఏకంగా 50 ఏళ్లుగా భోజనం చేయకుండానే జీవిస్తున్నారు.
ఆమె కేవలం టీ, హార్లిక్స్, కొన్ని హెల్త్ డ్రింక్స్ తాగుతూ గడిపేస్తున్నారు.
ఇదేదో కథలా ఉంది అనుకోకండి. నిజంగానే జరుగుతోంది.
హుగ్లీలోని గోఘాట్ జిల్లా బెల్దిహా గ్రామానికి చెందిన అనిమా చక్రబర్తి అనే వృద్ధురాలు ఇలా జీవిస్తోంది.
ఆమె వయసు ఇప్పుడు 76ఏళ్లు.
అనిమా చక్రబర్తి దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం నుంచి ఎలాంటి ఘన పదార్థాలు తినకుండా బతుకుతున్నారు.
కేవలం టీ సహా కొన్ని ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
అయినా కూడా ఆమె అందరిలాగే ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపుతున్నారు.
అయితే గతంలో ఇంట్లో పరిస్థితులు బాలేకపోవడం వల్లే ఈ వృద్ధురాలు ఆహారం తినకుండా కేవలం ద్రవపదార్థాలతో జీవించడం అలవాటు చేసుకుంది.