తెల్ల గుమ్మడి కాయలు అందంగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్నీ కాపాడతాయి. వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్, నలుపు ఇలా చాలా రకాలున్నాయి.
తెల్ల గుమ్మడికాయలో విటమిన్ A, B6, C, E, కెరోటిన్, ల్యూటిన్, జీలాంథిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫొలేట్, నియాసిన్, థియామైన్ ఉంటాయి.
అధిక బరువుకీ, గుండె జబ్బులకీ కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ని తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. బరువు తగ్గుతారు కూడా.
టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే.. L ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉండే తెల్ల గుమ్మడిని వాడాలి.
విటమిన్ A, ల్యూటెయిన్, జీలాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్.. తెల్ల గుమ్మడికాయలో ఉంటాయి. ఇవి కళ్లను అన్ని రకాలుగా కాపాడగలవు.
కీళ్లనొప్పులు (Arthritis) ఉండేవారు తెల్ల గుమ్మడికాయని వండుకొని తినాలి. ఇది కీళ్ల నొప్పులను బాగా తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలు కూడా తినాలి.
ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మక్రిములను తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. ఆస్తమా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడి కాయను కూరల్లో వాడాలి.
తెల్ల గుమ్మడిలో థెరప్యూటిక్ గుణాలుంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది. అల్సర్లు తగ్గుతాయి. అజీర్తి పోతుంది.
తెల్ల గుమ్మడి, గింజల్లో ఉండే కెరోటెనాయిడ్స్, జింక్.. ప్రొస్టేట్ (వీర్యగ్రంథి) క్యాన్సర్‌ని అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది.
తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. రకరకాల పోషకాలు అంది.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో సమాచారం అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించండి.