ఈ పైనాపిల్ విలువ రూ.లక్షకు పైనే!

telugu.news18.com

పైనాపిల్ విలువ రూ.లక్ష ఉందంటే.. ఆశ్చర్యంగానే ఉంటుంది కదా.

ఇది హెలిగాన్ పైనాపిల్. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది.

ఇక్కడ రూ.లక్ష అనేది ధర కాదు. ఈ పైనాపిల్ సాగుకి అయ్యే ఖర్చు అది.

ఈ పైనాపిల్‌ని ఇంగ్లండ్‌లోని లాస్ట్ గార్డెన్ ఆఫ్ హెలిగాన్‌లో ఉత్పత్తి చేస్తారు.

ఆ హెలిగాన్ గార్డెన్ పేరునే పైనాపిల్‌కి పేరుగా పెట్టారు.

ఈ పైనాపిల్‌ని తొలిసారి బ్రిటన్‌కి 1819లో తెచ్చారు.

గార్డెన్ అధికారులు 1999లో ఈ పైనాపిల్ సాగును మొదలుపెట్టారు.

ఇంగ్లండ్‌లో వాతావరణంలో పైనాపిల్ పండదు.

ఈ పైనాపిల్‌ని ఓ కూజాలో పండిస్తారు. ఒక్కో కూజాలో ఒక్కొక్కటి ఉంచుతారు.

ఒక్క పైనాపిల్ పెరిగేందుకు 2 నుంచి 3 ఏళ్లు పడుతుంది. అందుకు రూ.లక్ష దాకా ఖర్చవుతుంది.

ఈ పైనాపిల్స్‌ని ఎప్పుడూ అమ్మలేదు. అమ్మితే రూ.10 లక్షల దాకా ధర ఉంటుందని అంచనా.

వీటిని సంపన్నులకు గిఫ్టుగా ఇస్తారు.

(All photos credit - The Lost Garden of Heligan - Twitter)

Watch This- టైమ్ గురించి నమ్మలేని నిజాలు