ఈ 5 గ్యాస్ట్రిక్ సమస్యకు చిటికెలో చెక్ పెడతాయి..

ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గ్యాస్‌ను దూరం చేయడమే కాకుండా మలబద్ధకం, అసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. 

అరటిపండులో ఫైబర్ ఉంటుంది, ఇది గ్యాస్ నియంత్రణలో మంచి పాత్ర పోషిస్తుంది.

పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎసిడిటీ నుండి ఉపశమనం కూడా ఇస్తుంది.

కీరదోసకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, దోసకాయ తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. అలాగే కడుపులో మంట కూడా శాంతిస్తుంది. 

అంజీర్ కూడా మంచి పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ బి, సి, ప్రొటీన్లు, ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం నుండి ఉపశమనానికి కూడా సహాయపడుతుంది. 

గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు కివీని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కివి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది, అలాగే ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి