తెలంగాణ టూరిజం శాఖ ఈ ప్యాకేజీ తెచ్చింది
ప్రతి శుక్రవారం రాత్రి 7.30కి హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బస్సు వెళ్తుంది.
బస్సు శనివారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వెళ్తుంది.
యాత్రికులు భద్రాచలంలో సీతారాములును దర్శించుకుంటారు.
ఉదయం 8.30కి పోచారం బోటింగ్ పాయింట్‌కి వెళ్తారు.
పేరంటాలపల్లి మీదుగా కొల్లూరుకు బోటులో వెళ్తారు
బోటులోనే మధ్యాహ్న భోజనం చేస్తారు.
రాత్రి కొల్లూరులో ఉన్న వెదురు ఇళ్లలో ఉంటారు.
మూడోరోజు టిఫిన్ తిని, అడవిలో ట్రెక్కింగ్ చేస్తారు
మధ్యాహ్న భోజనం చేసి పోచారం బయలుదేరుతారు
పర్ణశాలను చూసి.. తిరిగి భద్రాచలం వస్తారు.
భద్రాచలంలోని హరిత హోటల్లో రాత్రి భోజనం చేస్తారు
మూడో రోజు రాత్రి 9కి భద్రాచలం నుంచి బయలుదేరతారు
సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ వస్తారు.
టికెట్ ధర పెద్దలకు రూ.6,499.. పిల్లలకు రూ.5,199
ఏసీ బస్సుల్లో ప్రయాణం, నాన్ ఏసీ వసతి ఉంటుంది
పూర్తి వివరాలు తెలంగాణ టూరిజం శాఖ వెబ్సైట్లో పొందవచ్చు
టోల్‌ఫ్రీ నంబరు 1800-425-46464 ద్వారా వివరాలు పొందవచ్చు.