జుట్టు రాలుతోందా.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం

telugu.news18.com

జుట్టు రాలిపోవడానికీ, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికీ సంబంధం ఉంటుందని కేరళ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు.

కొలెస్ట్రాల్ పెరిగితే.. హార్ట్ ఎటాక్ రాగలదు.

యూనివర్శిటీలోని.. జువాలజీ విభాగం, అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇన్ క్యూటానియస్ బయోలజీ (AcREM-Stem) కలిసి ఈ పరిశోధన చేశాయి.

కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు. ఇది ధమనులు సహా రక్త నాళాల్లో పేరుకుపోయి.. గుండె జబ్బులు రావడానికి కారణం అవుతోంది.

శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు... బయోసింథెసిస్ ప్రక్రియ జరుగుతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు ఫైబ్రోసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది.

ఫైబ్రోసిస్ ప్రక్రియ వల్ల కుదుళ్లు శాశ్వతంగా పాడవుతాయి. ఫలితంగా జుట్టు రాలిపోతూ ఉంటుందని తేల్చారు.

ఈ పరిశోధన పూర్తి వివరాల్ని ఎండోక్రినోలజీ అండ్ రీప్రొడక్షన్ అనే జర్నల్‌లో రాశారు.

"కొలెస్ట్రాలోజెనిక్ మార్పులు వెంట్రుకల శాశ్వతంగా రాలిపోయేలా చేస్తాయి" అని ఈ పరిశోధనను నడిపిస్తున్న లీడ్ ఆథర్ నజీబ్ తెలిపారు. 

కేరళలోని 30 గ్రామ పంచాయతీల్లోని ప్రజల నుంచి సమాచారం సేకరించి.. ఈ పరిశోధన ఫలితాల్ని వెల్లడించారు.

జుట్టు రాలిపోతున్న వారందరికీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నట్లే అని అనుకోలేం.

జన్యు పరమైన కారణాలు, జుట్టుకి సరైన పోషణ లేకపోవడం, టెన్షన్, ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. 

ఏ కారణాలూ లేకపోయినా రోజూ ప్రతి ఒక్కరికీ 100 వెంట్రుకల దాకా రాలడం, కొత్తవి రావడం జరుగుతుంది.

మైదా, పామాయిల్ వంటివి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం అవుతున్నాయి. వాటిని తగ్గించుకోవడం లేక వాడటం మానేస్తే.. ఆరోగ్యం మెరుగవుతుంది. 

Watch This- సూపర్ స్టైలిష్ బైక్.. 200కి.మీ మైలేజ్