రాణి చీమల సీక్రెట్ తెలిస్తే, ఇక మన వయసు పెరగదు

telugu.news18.com

ప్రాణి ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి రేటు కలిగివుండే జీవులు తక్కువ జీవిత కాలం కలిగివుంటాయి.

రాణి చీమలు మాత్రం ఎక్కువ ఉత్పత్తి రేటు కలిగివున్నా.. ఎక్కువ జీవిత కాలం (30 ఏళ్లు) కలిగివుంటున్నాయి.

తమ లాంటి వాటితో పోల్చితే.. రాణి చీమలు 10 నుంచి 30 రెట్లు ఎక్కువ కాలం జీవిస్తున్నాయి.

దీనిపై ఫ్లోరిడా యూనివర్శిటీ, న్యూయార్క్ యూనివర్శిటీతో కలిసి అధ్యయనం చేసింది.

రాణి చీమలు తమ ఇన్సులిన్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తి రేటు, జీవితకాలం రెండూ పెరుగుతున్నాయి.

సంతానోత్పత్తి కోసం రాణి చీమలు.. భారీగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 

రాణి చీమలలోని అండాశయాలు ఇన్సులిన్ బ్లాకర్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. అది వయసు త్వరగా పెరగకుండా చేస్తోంది.

ఇదెలా సాధ్యమో తెలుసుకుంటే.. మనుషులు కూడా తమ వయసు త్వరగా పెరగకుండా చేసుకోగలరు.

ఇతర ప్రాణులలో కూడా ఇలా జరుగుతోందా అనే అంశాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

ఈ అంశంపై ఎంత లోతుగా అధ్యయనం జరిగితే.. మానవాళికి అంతగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

ఈ అధ్యయన వివరాల్ని సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.

Watch This- మినీ ఫ్యాన్.. ఇదొక్కటి చాలు