జుట్టు ఎందుకు రాలుతుంది: జుట్టు అనేది ప్రతి రోజూ అందరికీ రాలుతూనే ఉంటుంది. ఐతే... మరీ ఎక్కువగా రాలుతుంటే మాత్రం సమస్యే.
ఆరోగ్యంగా ఉండేవారికి రోజూ 60-100 వెంట్రుకలు రాలుతాయి. ఈ స్థానంలో మళ్లీ కొత్త వెంట్రుకలు వస్తాయి. అలా రాకపోతే జాగ్రత్త పడాలి.
కారణాలు అనేకం: జుట్టు పల్చబడేందుకు కారణాలు చాలా ఉన్నాయి. వయసు పెరుగుతుంటే జుట్టు రాలడం సర్వసాధారణం.
మహిళల్లో అయితే వయసు వల్ల మాత్రమే కాకుండా ఇతర కారణాలతోనూ జుట్టు రాలుతుంది.
వంశపారంపర్యంగా (heredity) అంటే మీ పెద్దలకు జుట్టురాలే వ్యాధి ఉంటే మీకు కూడా అది వస్తుంది.
విటమిన్ల లోపం: విటమిన్ A, B, C, D, E, జింక్, సెలీనియం లోపం ఉంటే జుట్టు రాలుతుంది.
విటమిన్స్, మినరల్స్ లోపం ఉంటే వీటిని అధిగమించేందుకు అవసమైన టాబ్లెట్లు వేసుకుని, మంచి పోషకాహారం తింటే సరిపోతుంది.
ఆర్గానిక్ షాంపూలకు బదులుగా SLS షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు బాగా మెయింటైన్ అవుతుందని ఇటీవల డెర్మాటాలజిస్టులు సూచించారు.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.
ఆలివ్ ఆయిల్ మీ జుట్టు వాల్యూమ్‌ను పెంచుతుంది. కాబట్టి మీరు తలపై నూనె రాసుకున్నప్పుడు మీ జుట్టు సాంద్రత మరింత పెరుగుతుంది.
అధిక ఆయిల్ మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది మీ తలకు రక్త ప్రసరణను పెంచుతుంది మరియు మూలాలను బలపరుస్తుంది.
రోజుకు చాలాసార్లు తల దువ్వుకోవడం ఆరోగ్యకరం: రోజుకు చాలాసార్లు తల దువ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?: మీ జుట్టు మరీ ఎక్కువ రాలుతోందని మీకు కచ్చితంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా మంచిది.