టీని ఎక్కువగా తాగకూడదు. అందులోని కెఫైన్ (caffeine) బ్రెయిన్‌కి హాని చెయ్యగలదు.
అన్ని టీలలోనూ కెఫైన్ ఒకేలా ఉండదు. తేయాకు రకం? ఎలా ఉడికించామన్న దాన్ని బట్టీ.. కెఫైన్ ఎంత ఉంది అనేది ఆధారపడి ఉంటుంది.
బ్లాక్ టీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ (oolong) టీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది.
టీ తాగడం మీకు సమస్యే అనుకుంటే.. మీరు టీ బదులు వేరే డ్రింక్స్ తాగవచ్చు.
చామంతి టీ, మిరియాల టీ,అల్లం టీ, రూబోస్ (Rooibos) టీలలో కెఫైన్ ఉండదు. ఇవి కొన్ని రకాల ఆరోగ్య ప్రయాజనాలు కూడా ఇస్తాయి.
కొన్ని రెస్టారెంట్లలో కెఫైన్ లేని టీ (caffeine-free) అని చెబుతారు. మామూలు టీలతో పోల్చితే.. అందులో చాలా తక్కువ కెఫైన్ ఉంటుంది.
నిమ్మరసం, కీరదోస ముక్కలు, బెర్రీస్ వంటి పండ్లకు నీటిని జోడించి.. ఫ్లేవర్, న్యూట్రియంట్స్ జతచేసి.. టీ లాగా తాగొచ్చు.
గోరు వెచ్చని పాలు, పాల ఆధారిత డ్రింక్స్ అంటే హాట్ చాక్లెట్, టర్మెరిక్ లాట్టే వంటివి కూడా టీ బదులు తాగేందుకు వీలుగా ఉంటాయి.
నీరు కూడా మంచిదే. మన శరీరాన్ని తేమగా ఉంచడమే కాదు, బ్రెయిన్ ఇతర శరీర అవయవాలు బాగా పనిచేయడానికి నీరు చాలా అవసరం.
కొంతమంది శరీరానికి కెఫైన్ సెట్ అవుతుంది. అలాంటి వాళ్లకు ఎన్ని టీలు తాగినా ఏమీ కాదు. కాబట్టి.. ఈ సమాచారం అందరికీ ఒకేలా వర్తించదు.