అల్లం తొక్కతో
అద్భుత
ప్రయోజనాలు..

telugu.news18.com

అల్లం (Ginger) అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది . దీన్ని అనేక విధాలుగా తినవచ్చు.

అయితే.. మనలో చాలా మంది మహిళలు తమ కిచెన్లో అల్లం తొక్కను తీసి వేయడానికే ఇష్టపడతారు.

అయితే.. ఆ అల్లం తొక్కతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. 

ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుంటే మీరు జన్మలో అల్లం తొక్కను పారేయరు. 

దగ్గు ఫసక్  : మీరు దగ్గుతో బాధపడుతుంటే.. అల్లం తొక్క ఎండబెట్టి పొడి చేసుకోవాలి. 

బాగా దగ్గుతో ఉన్నప్పుడు.. ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినండి. 

ఉదర సమస్యలు తొలగిపోతాయి :  మనలో చాలా మంది గ్యాస్, అజీర్తి వంటి చాలా ఉదర సమస్యలతో బాధపడతాం.

అలాంటప్పుడు అల్లం బెరడును నీటిలో వేసి మరిగించాలి. ఆ మరిగించిన నీటిని తాగితే కడుపు సమస్యలు తొలగిపోతాయి.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

జలుబు సమస్యలకు దివ్యౌషధం :  అల్లం తొక్కతో చేసిన టీ తాగడం వల్ల జలుబు మరియు దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. 

మొక్కలకు ఎరువు : అల్లం తొక్కలను పారేసే బదులు మొక్కలకు ఎరువుగా వాడండి. 

ఇందులో చాలా భాస్వరం ఉంటుంది. దీంతో మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే.. బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు.

వంటల్లో రుచి కోసం : మీరు మీ ఆహారంలో అల్లం ఇష్టపడకపోతే.. దాని స్థానంలో అల్లం తొక్క వేయండి. ఇది రుచిని పెంచుతుంది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి