దక్షిణ భారత దేశంలో పర్యాటకులు చూడాల్సిన టాప్ 5 టూరిస్ట్ ప్రదేశాలపై ఓ లుక్కేద్దాం.
దక్షిణ భారతదేశంలో ఆశ్చర్యగొలిపే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.
పర్యాటకులకు మరపు రాని మధుర అనుభవాలను పంచే దక్షిణ భారత దేశంలోని ఆసక్తికర టూరిస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గండికోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో పెన్నా నదికి ఆనుకుని ఉన్న చిన్న గ్రామం ఇది. దీనిని గ్రాండ్ కాన్యన్ అని కూడా పిలుస్తారు.
చరిత్రను గుర్తు చేసే ఎన్నో సాక్ష్యాలతో గండికోట దక్షిణ భారత దేశంలో చూడదగ్గ ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా పేరుగాంచింది.
అరకు వ్యాలీ : విశాఖపట్నం జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్ అరకు వ్యాలీ. సిటీ లైఫ్ కు దూరంగా సమయం గడిపేందుకు ఇది ఓ చక్కని గమ్యస్థానం.
సముద్ర మట్టానికి 996 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్ ను సందర్శించేందుకు నిత్యం టూరిస్టులు వస్తుంటారు.
ధనుష్కోడి : 'దెయ్యాల నగరం' లేదా 'కోల్పోయిన నగరం' అని పిలవబడే ధనుష్కోడి ఎప్పటికీ చెరగని గుర్తింపు కలిగి ఉంది.
ఇది తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ ద్వీపంలో ఉంది. 1964 విపత్తు తర్వాత ధనుస్కోడి టూరిస్ట్ ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
హొగెనక్కల్ జలపాతాలు : ఉత్కంఠభరిత అనుభూతిని అందించే హొగెనక్కల్ జలపాతాలు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో కావేరీ నదిపై ఉన్నాయి.
బెంగళూరు నుంచి 180 కిలోమీటర్లు, ధర్మపురి పట్టణం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతాలు ఉన్నాయి. ఈ నీటికి ఔషధ విలువలు ఉన్నట్లు చెబుతారు.
స్కందగిరి : స్కందగిరిని కలవర దుర్గ అని కూడా పిలుస్తారు. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది.