మన దేశంలో పురాతన కాలం నుంచి చద్దన్నం తినే అలవాటును కొనసాగిస్తున్న ప్రజలు
వేసవిలో వివిధ పద్ధతుల్లో తయారు చేసే చద్దన్నం తినడం ఆరోగ్యానికి మంచిది
రాత్రి వండిన అన్నంలో పాలు పోసి, కాస్త మజ్జిగ వేసి పక్కన పెడతారు
తర్వాతి రోజు పొద్దున్నే ప్రత్యేకమైన రుచితో చద్దన్నం రెడీ అవుతుంది
కొంతమంది రాత్రి వండిన అన్నంలో నీళ్లుపోసి, తర్వాత రోజు పొద్దున్నే దాన్ని పెరుగుతో తింటారు
ఎలా తయారు చేసినా చద్దన్నం ఆరోగ్యానికి మంచిదే అంటున్న ఆయుర్వేద నిపుణులు
సమ్మర్లో చలువ చేసే చద్దన్నాన్ని స్పెషల్ రెసిపీగా అందిస్తున్న కొన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో చద్దన్నాన్ని ‘పకాలన్నం’ పేరుతో పిలుస్తారు
ఒడిశాలో ‘పొఖాళొ’ పేరుతో తయారు చేసే చద్దన్నం ఎంతో ఫేమస్
పూరీ జగన్నాథుడికి రోజూ నైవేద్యంగా పెట్టే 56 పదార్థాలలో ‘పొఖాళొ’ ఒకటి
ఈ జనరేషన్లో చద్దన్నం వాడకం తగ్గిందంటున్న ఫుడ్ ఎక్స్పర్ట్స్