పుచ్చకాయల్ని అతిగా తింటే 5 సమస్యలు

telugu.news18.com

పుచ్చకాయల్ని ఎండాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటాం. ఐతే.. పుచ్చకాయను అతిగా తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.

100 గ్రాముల పుచ్చకాయలో 30 కేలరీలు, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, షుగర్, ప్రోటీన్, విటమిన్ C, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, కొద్దిగా ఫ్యాట్ ఉంటాయి. 

పుచ్చకాయ తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. కంటి చూపు మెరుగవుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండెకు మేలు జరుగుతుంది.

పుచ్చకాయ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. చర్మం తేమగా ఉంటుంది. రకరకాల వ్యాధులు రావు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.

పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తింటే.. కడుపులో తేడా చేస్తుంది. పొట్ట ఉబ్బుతుంది. విరేచనాల సమస్య వస్తుంది.

పుచ్చకాయలోని లైకోపీన్.. మన శరీరంలో ఎక్కువైతే.. వికారం, విరేచనాలు, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.

కొంతమందికి పుచ్చకాయల వల్ల అలర్జీ వస్తుంది. దురద, పొక్కులు, నీటి కురుపులు, అతిగా చెమట పట్టడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

పుచ్చకాయను వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లు పుచ్చకాయను ఎంత వాడాలో డాక్టర్ సలహా తీసుకోవాలి.

పుచ్చకాయ హైబీపీ మందుల్ని ప్రభావితం చేసి.. బీపీని బాగా తగ్గించేయగలవు. ఫలితంగా కళ్లకు మసక, కళ్లు తిరగడం వంటి సమస్యలు రాగలవు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సోషల్ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.

Watch This- బ్లాక్ ద్రాక్ష.. గ్రీన్ ద్రాక్ష.. ఏది బెటర్?