పరీక్షల టైమ్‌లో విద్యార్థులు రాత్రీ, పగలూ చదివేస్తారు. గంటకోసారి టీ తాగుతారు.
టీ తాగుతూ చదివేవారు పరీక్షలు బాగా రాయలేరని నిపుణులు చెబుతున్నారు.
టీలో కెఫైన్ (caffeine) బ్రెయిన్‌ను అలర్ట్‌గా, ఫోకస్‌గా ఉంచుతుంది. విద్యార్థులు బాగా చదివేలా చేస్తుంది. కానీ ఇదే సమస్యగా కూడా మారుతుంది.
రాత్రివేళ నిద్ర మానేసి, టీ తాగుతూ చదివితే బ్రెయిన్ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది.
తెల్లారి పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాసేటప్పుడు.. బ్రెయిన్ నిద్ర వచ్చేలా చేస్తుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ సరిగా రాయలేరు.
బలవంతంగా నిద్రను ఆపుకుంటే.. అది తలనొప్పిగా మారుతుంది. అది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిళ్లు నిద్ర తప్పనిసరి.
టీలో పంచదార లాంటి తీపి పదార్థాలు బ్రెయిన్‌ని మొద్దుబారేలా చేస్తాయి.
టీ వల్ల కలిగే యాక్టివ్‌నెస్ కంటే.. పంచదార వల్ల కలిగే మత్తే ఎక్కువగా ఉంటుంది. మత్తు వల్ల బ్రెయిన్‌కి చదివింది ఎక్కదు.
పడుకోవాల్సిన సమయంలో చదువుతూ.. టీ తాగుతూ ఉంటే.. నిద్రలేమి (Insomnia) సమస్య మొదలవుతుంది. ఇది మరింత ప్రమాదకరం.
నిద్రలేమి సమస్య వచ్చిన వారికి నిద్రపోదామన్నా నిద్ర రాదు. కొంతమంది నిద్రమాత్రలు వేసుకుంటూ ఉంటారు.
విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే.. కొద్దిసేపు చదివినా.. బ్రెయిన్‌కి బాగా ఎక్కుతుంది. చదివేది అర్థం చేసుకుంటూ.. దృశ్యాల రూపంలో ఊహించుకుంటూ చదవాలి.
ఎంత చదివామన్నది కాదు.. ఎలా చదివామన్నది చూసుకోవాలి. చదివే పాఠాన్ని అర్థం చేసుకోవాలి. అందులో ఏం చెప్పారు, మనకు ఏం అర్థమైంది అనేది గ్రహించాలి.
చదివేటప్పుడు బ్రెయిన్‌కి ఆక్సిజన్ బాగా అందాలి. అందుకోసం నీరు బాగా తాగాలి. అలాగే.. గాలి బాగా వీచే ప్రదేశంలో కూర్చొని చదవాలి.