డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

telugu.news18.com

డ్రాగన్ ఫ్రూట్ హైలోసెరస్ అనే కాక్టస్ మీద పెరుగుతుంది. ఇది  ఒక పోషకమైన ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

డ్రాగన్ ఫ్రూట్ ఎనర్జీ రిచ్ ఫ్రూట్. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 102 క్యాలరీ శక్తి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం.

డ్రాగన్ ఫ్రూట్ సీడ్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీంతో జీర్ణశక్తిని బలపరుస్తుంది. దీని గింజల్లో ఒమేగా-3 ,ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె కణాలను బలపరుస్తుంది.

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు నియంత్రణకు కూడా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం మేలు చేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ ,బీటాసినిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.

ఫ్రీ రాడికల్స్ వల్ల కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అకాల వృద్ధాప్యం ,క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి.

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి