ఉదయం తినే ఆహారం ఆ రోజంతా ఉల్లాసంగా ఉంచడానికి దోహదపడుతుంది.
ఉదయపు ఆహారం, పౌష్టికాహారం పేగు ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు.
కానీ ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తినకూడదు. ఆ ఆహార పదార్ధాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్పైసీ ఫుడ్ : మీరు ఖాళీ కడుపుతో మసాలా పదార్ధాలు ఏదైనా తింటే.. మీరు ఉదర సమస్యలను ఎదుర్కొంటారు. కడుపులో అజీర్ణం కూడా రావచ్చు.
జామ పండు : చలికాలంలో ఖాళీకడుపుతో జామ తింటే కడుపునొప్పికి ఆహ్వానం పలుకుతుంది. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.
అరటిపండు: ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో మెగ్నీషియం , పొటాషియం స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది.
కాఫీ: ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో ఎసిడిటీ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అజీర్ణం లేదా గుండెల్లో మంట సమస్యను ఎదుర్కొంటారు.
పెరుగు: పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకుడదు.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.
టమాట: టమోటాలు ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ఇందులో ఉండే టానిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ యాసిడ్తో చర్య జరుపుతుంది.
దాని కారణంగా కడుపులో చికాకు మరియు అసౌకర్యంగా ఉంటుంది.
పచ్చి కూరగాయలు: ఖాళీ కడుపుతో కూరగాయలు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.