ప్రపంచంలో అత్యంత ఇష్టమైన పానీయాలలో కాఫీ ఒకటి. చాలా మంది తమ రోజును కాఫీతో ప్రారంభించేందుకు ఇష్టపడతారు. రోజులో ఏ సమయంలోనైనా కాఫీ తాగడం ఈ రోజుల్లో ప్రజలకు అలవాటుగా మారింది.
రోజుకు రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్‌గా ,ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహంతో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
హెల్ట్లైన్ నివేదిక ప్రకారం రోజూ 3 నుండి 5 కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుంది. అలాగే, స్ట్రోక్ ప్రమాదాన్ని 21% తగ్గుతుందని నిరూపితమైంది
అయితే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కాఫీలో ఉంటే కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, రక్తపోటు ఉన్న రోగుల కాఫీ తాగే ముందు డాక్టర్ ని సంప్రదించాలి
కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన శరీరం శక్తి స్థాయిని పెంచుతుంది. అలసట నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీని ప్రభావం మన మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లపై ఉంటుంది.
మెదడు ఆరోగ్యానికి కాఫీ గొప్పదని భావిస్తారు.ఒక అధ్యయనంలో కాఫీ తీసుకోవడం వల్ల డిప్రెషన్ రిస్క్ 8% తగ్గుతుందని వెల్లడైంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.