టోమాటో రసం.. ధూమపానం చేసేవారికి వరం

telugu.news18.com


మార్కెట్లో ఎన్నో ఎనర్జీ డ్రింక్స్ ఉండొచ్చు. కానీ టొమాటో జ్యూస్ నాచురల్ ఎనర్జీ డ్రింక్ అని మీకు తెలుసా?

టొమాటో రసం టానిక్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. వ్యాయామం తర్వాత శక్తిని పొందడానికి బాగా పనికొస్తుంది


యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి


టొమాటో జ్యూస్‌లో విటమిన్లు బి-3, ఇ , లైకోపీన్ ఉన్నాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి

టొమాటో రసంలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు అవకాశాలను బాగా తగ్గిస్తుంది

టొమాటో రసంలో విటమిన్ కె , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను మరింత దృఢంగా మార్చుతుంది


టొమాటో రసంలోని క్లోరోజెనిక్ యాసిడ్ , కౌమారిక్ యాసిడ్.. ధూమపానం వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి


ఇందులో మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది

 మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లయితే చాలా పరిమిత పరిమాణంలో టమోటా రసం తీసుకోవాలి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి