బీపీ మందులు వేసుకోవడం మానేస్తున్నారా?

telugu.news18.com

ఇండియాలో డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో అనే భయం సామాన్యుల్లో ఉంటోంది.

తరచూ టెస్టులు చేయించుకోకపోవడం వల్ల ఇండియాలో చాలా జబ్బులను ముందుగా గుర్తించలేకపోతున్నారు. వాటిలో బీపీ ఒకటి.

బీపీని ప్రారంభంలోనే గుర్తిస్తే.. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు.

మన శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువ వేగంతో ఉంటే హైబీపీ అంటారు. తక్కువ వేగంతో ఉంటే లోబీపీ అంటారు.

సాధారణంగా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ 120/80 mmHg కంటే తక్కువగా ఉండాలి. 

రక్త ప్రసరణలో తేడా వచ్చిన వారు.. సడెన్‌గా ఓ రోజు కిందపడిపోతారు. నీరసంగా అయిపోతారు.

బీపీ వచ్చిన వారికి డాక్టర్లు మందులు ఇస్తారు. చాలా మంది వాటిని కొన్ని రోజులే వాడుతారు.

మందులతో అంతా సరి అయినట్లు అనిపించగానే మందులు వాడటం మానేస్తారు. 

మందులు వాడటం మానవద్దని డాక్టర్లు చెబుతున్నారు. మానేస్తే గుండె, కిడ్నీలు దెబ్బతింటాయి అంటున్నారు. 

బీపీ సరిగ్గా ఉండాలంటే.. మందులు క్రమం తప్పకుండా వాడాలనీ, హెల్తీ లైఫ్‌స్టైల్ పాటించాలని అంటున్నారు.

Disclaimer: ఈ సమాచారం అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.

Watch This- 12 వాస్తు మార్పులతో ధనయోగం