గ్రీన్, బ్లాక్ ద్రాక్షలో ఏది తినడం బెటర్ అనే డౌట్ మనకు ఉంటుంది. దానికి ఆన్సర్ చూద్దాం.
గ్రీన్ ద్రాక్ష ధర తక్కువ, బ్లాక్‌వి ధర ఎక్కువ. ధర ఎక్కువగా ఉన్నంత మాత్రాన బ్లాక్ ద్రాక్ష బెటర్ అనుకోవాల్సిన పనిలేదు.
నల్ల ద్రాక్ష ఎక్కువ రుచితో, ఎక్కువ తీపితో ఉంటాయి. వాటి రుచి కూడా ఎక్కువగానే ఉంటుంది. పైగా ఎట్రాక్టివ్‌గా ఉంటాయి.
గ్రీన్ గ్రేప్స్ తినేటప్పుడు కరకరలాడతాయి. కాకపోతే.. ఇవి తీపితోపాటూ.. పులుపు కూడా కలిసి ఉంటాయి.
బ్లాక్ గ్రేప్స్‌ని... తరచుగా రెడ్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. గ్రీన్ గ్రేప్స్‌ని వైట్ వైన్ తయారీలో వాడుతారు.
రెండు రకాల ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
బ్లాక్ గ్రేప్స్‌లో యాంతోసియానిన్స్ ఉంటాయి. అదనపు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
గ్రీన్ గ్రేప్స్‌లో విటమిన్ కే, పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి.
మొత్తంగా... ఏ పండ్లు తినాలి అనేది మన అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తినవచ్చు. ద్రాక్షను రెగ్యులర్‌గా తినడం మంచిది.
ఇవి క్యాన్సర్‌తో పోరాడతాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. కండరాలకు ఉపశమనం కలిగిస్తాయి. కీళ్లనొప్పులు తగ్గిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. మెమరీ పవర్ పెంచుతాయి. ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాయి.